- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహబూబాబాద్ జిల్లాలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత
దిశ, కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో భారీగా రేషన్ బియ్యం పట్టుబడింది. తెలంగాణ ప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల కోసం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం అక్రమార్కుల మూలంగా పక్కదారి పడుతోంది. వివరాల్లోకి వెళ్తే.. కొత్తగూడ మండలంలోని గోపాల పురం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో 200 బస్తాలు 100 కింటాళ్ళు రేషన్ బియ్యం పట్టుబడింది. అక్రమంగా రేషన్ బియ్యం బస్తాలను నిల్వచేశారన్న సమాచారం పోలీసులకు విశ్వసనీయ వర్గాల నుండి అందినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పోలీసులు బియ్యం బస్తాలని సీజ్ చేసి కొత్తగూడ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఈ విషయంపై కొత్తగూడ ఎస్‌ఐ నగేష్‌ని వివరణ కోరగా.. భారీగా రేషన్ బియ్యం బస్తాలను పట్టుకున్న సంగతి వాస్తవమే అన్నారు. అయితే రేషన్ బియ్యాన్ని ఎవరు నిల్వ చేశారన్నది తెలియాల్సి ఉందని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్‌ఐ నగేష్ తెలిపారు.