సీటీ కొట్టలేకపోతున్న ‘సీటీమార్’

by Shyam |
Seetimaarr poster
X

దిశ, సినిమా: ‘సీటీమార్’ రిలీజ్ వాయిదా పడింది. గోపీచంద్, తమన్నా భాటియా కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌ పనుల్లో ఆలస్యం కారణంగా పోస్ట్‌పోన్ అయింది. ఈ మేరకు ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన సినిమాను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రేక్షకులకు గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారికంగా వెల్లడించిన మూవీ యూనిట్.. త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. సినిమా రిలీజ్‌లో ఆలస్యం.. ఖచ్చితంగా విలువైనదిగా ఉంటుందని హామీ ఇచ్చారు.

కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామాకు సంపత్ నంది దర్శకులు కాగా.. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ నిర్మిస్తోంది. మణిశర్మ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో భూమిక చావ్లా, దిగంగనా సూర్యవంశీ కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు.

Advertisement

Next Story

Most Viewed