- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పట్టాలెక్కిన ప్రత్యేక రైళ్లు.. సికింద్రాబాద్‌లో ప్రయాణికుల సందడి
కరోనా వైరస్ మూలంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో రాకపోకలు బంద్ అయ్యి, రైళ్లు, బస్సులు నిలిచిపోయాయి. దీంతో దాదాపు 50రోజులుగా జనాలు లేక రైల్వే స్టేషన్లు, బస్టాండులు బోసిబోయాయి. సుదీర్ఘ విరామం తర్వాత సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ మళ్లీ ప్రయాణికులతో సందడిగా మారింది. బెంగుళూర్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్తున్న ప్రత్యేక రైలు ఈరోజు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లోని 10వ నెంబర్ ప్లాట్‌ఫామ్‌కు చేరుకుంది. దీంతో రైల్వేస్టేషన్‌లో సిబ్బంది భౌతిక దూరం పాటిస్తూ ప్రత్యేక లైన్స్‌ను ఏర్పాటు చేశారు. మాస్క్, శానిటీజర్స్‌తో ఉన్న ప్రయాణికులనే సిబ్బంది రైళ్లలోకి అనుమతిస్తున్నారు. అలాగే రైలు ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరి చేతికి అధికారులు స్టాంప్ వేస్తున్నారు. దాదాపు 243 మంది ప్రయాణికులు బెంగళూర్ నుంచి సికింద్రాబాద్‌కు వచ్చారు. అలాగే సికింద్రాబాద్ నుంచి 288 మంది ప్రయాణికులు ఢిల్లీ వెళ్లనున్నారు. పరిమిత సంఖ్యలోనే ప్రయాణికులకు రైల్వేశాఖ అనుమతి ఇచ్చింది. టికెట్ కన్ఫర్మ్ అయిన వారిని మాత్రమే లోపలికి అధికారులు అనుమతిచ్చారు.