భైంసాలో 144 సెక్షన్.. ఎప్పటివరకంటే..?

by Aamani |   ( Updated:2021-10-25 23:15:32.0  )
Bimsa111
X

దిశ, ముధోల్: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఆదివారం అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన కారణంగా పట్టణ శాంతి పరిరక్షణ పరిస్థితుల దృష్ట్యా ఆదివారం నుండి మంగళవారం వరకు పట్టణంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు నిత్యావసర సరుకుల కొనుగోలు నిమిత్తం దుకాణసముదాయాలు తెరిచి ఉంచడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. అనుమతి సమయాల్లో తప్ప మిగతా సమయాల్లో, షాపులు తెరిచి ఉంచడానికి అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

Next Story