పాదాభివందనం.. పాటాభివందనం..

by Shyam |   ( Updated:2023-04-13 17:11:45.0  )
పాదాభివందనం.. పాటాభివందనం..
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఆ పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మహమ్మారి వైరస్ కరోనా సోకిన వారికి సేవలు చేస్తున్నవారికి, కరోనాను కట్టడిలో భాగస్వాములవుతోన్నవారి సేవలను కొనియాడుతూ వారికి ప్రత్యేక వందనలు చెబుతూ కొనసాగింది ఆ పాట. అందుకే ఆ పాట ఇప్పుడు నెట్టింట తెగ వైరలోవుతోంది. అదేంటో మీరు కూడా చూడండి.. విషయమేమిటంటే.. యావత్ ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా భూతం భారతదేశం గడపదొక్కి ఇక్కడ విలయతాండవం చేస్తుంది. ఈ నేపథ్యంలో దానిని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో వైద్యులు, నర్సులు, అధికారులు, ఆర్మీ, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందితోపాటు పలు ఇతర అత్యవసర విభాగాలకు చెందిన ఇతర సిబ్బంది అంతా కూడా సేవలందిస్తున్నారు. కరోనాకు ఏ మాత్రం భయపడకుండా, తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి సేవలను కొనియాడుతూ.. వారికి ప్రత్యేక పాదాభివందనాలు తెలియజేస్తూ ప్రముఖ జానపద గాయకుడు సాయిచంద్ తానే సొంతంగా పాట రచియించి ఓ వీడియో రూపాంలో పాడి దానిని రికార్డు చేశారు. దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అది చూసిన నెజిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed