- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్విట్టర్‌లో లూజర్ అని సెర్చ్ చేస్తే..
దిశ, వెబ్‌డెస్క్: శనివారం రోజున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్ తన రియాలిటీని ఇంకా అంగీకరించలేకపోతున్నాడు. ఇద్దరు అధ్యక్షుల మధ్య శాంతిపూర్వకంగా జరిగే అధికారాల బదిలీ కోసం సంప్రదాయంగా నిర్వహించే ఓవల్ ఆఫీస్ మీటింగ్‌కు కూడా ట్రంప్ ఆసక్తి చూపించడం లేదని, తన ఓటమిని ఏమాత్రం అంగీకరించలేని స్థితిలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అమెరికా ప్రజలు, ఇంటర్నెట్ మాత్రం ఆయనను లూజర్‌గా మార్క్ వేసేశాయి. ఈ పరిస్థితి ఎంతలా మారిదంటే, ట్విట్టర్‌లో లూజర్ అని సెర్చ్ చేస్తే, ట్రంప్ పేరే వస్తోంది. మరి ఇలా ఎవరు చేశారు?
నిజానికి పేరులో గానీ, ట్విట్టర్ బయోలో గానీ లూజర్ అనే పదం ఉంటే సెర్చ్ రిజల్ట్‌లో కనిపించేలా అల్గారిథమ్ పనిచేస్తుంది. కానీ ట్రంప్ పేరులో గానీ, బయోలో గానీ ఆ పదం లేదు అయినప్పటికీ ఇలా మొదటి ఫలితంగా చూపించడానికి కారణం లేకపోలేదు. ఎన్నికలు పూర్తయిన రోజు నుంచి ట్వీట్ చేసిన ప్రతి ఒక్కరు ‘ట్రంప్, లూజర్, లాస్ట్’ అనే హ్యాష్ ట్యాగ్‌లను విపరీతంగా ఉపయోగించారు. దీని వల్ల అల్గారిథమ్ లూజర్ అనే పదాన్ని సెర్చ్ చేసినపుడు ట్రంప్ ఖాతాను మొదటి ఫలితంగా చూపిస్తోంది.