- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జార్ఖండ్ లో మొదలైన వినూత్న విద్యా విధానం..
దిశ, ఫీచర్స్ : ఆరోగ్యంతో పాటు కండరాలు దృఢంగా ఉండేందుకు వ్యాయామాలు చేస్తుంటాం. అదే విధంగా మెదడు ఎప్పుడూ చురుకుగా ఉండాలంటే.. నిరంతరం పజిల్స్ సాల్వ్ చేయడం, లేదా కొత్త భాష నేర్చుకోవడం, విభిన్న ప్రయోగాలు చేయడం వంటి ఎక్సర్‌సైజెస్ అవసరం. అంతేకాదు ప్రాక్టికల్‌గా పాఠాలు చెప్పటంవల్ల కూడా మెదడుకు కావాల్సిన వ్యాయామం దొరికి, విద్యార్థుల చదువుతో పాటు, జ్ఞాపకశక్తి కూడా మెరుగవుతుందని జార్ఖండ్‌లోని ‘స్కూలాసియం’ బోధకులు నిరూపిస్తున్నారు.
చాలా విద్యాలయాల్లో ఇప్పటికీ థియరీ ఓరియెంటెడ్ విద్యాబోధనే చేస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు పాఠ్యాంశాల్లోని కీలక అంశాలను నేర్చుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని, ఈ మెథడ్‌లో నాలెడ్జ్ షేర్ అవుతుంది కానీ పరస్పరం ట్రాన్స్‌ఫర్ కావడం లేదని, జర్మనీలోని నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీ (NAL) లో హై-ఫ్లైయింగ్ ఉద్యోగం చేసే మహమ్మద్ సాజిద్ హుస్సేన్ గ్రహించాడు. ఈ క్రమంలోనే పాఠాలు బోధించే విధానాన్ని మార్చి విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఉద్యోగాన్ని వదలిపెట్టి జార్ఖండ్‌లోని తన స్వగ్రామమైన చితార్‌పూర్‌లో ‘స్కూలాసియం’ అనే పాఠశాల ప్రారంభించాడు. ఇందులోని బోధకులు విద్యార్థులకు ఆచరణాత్మక పాఠాలు అందిస్తూ.. పిల్లల మెదడుకు మేత పెడతారు. ఈ టీచింగ్ మెథడాలజీని మేకర్ ఓరియెంటెడ్ పెడగాజి (MOP) అని పిలుస్తారు. ఇది ఆచరణాత్మక జీవిత పాఠాల ద్వారా పిల్లలు తమ సమస్యను వారే పరిష్కరించుకునేలా ప్రయత్నించే ప్లే ఓరియెంటెడ్ లెర్నింగ్ సిస్టమ్.
‘ప్రపంచవ్యాప్తంగా‘ టెక్నాలజీ ట్రాన్సిషన్’ జరుగుతోంది. కాబట్టి పాతపద్ధతిలో పాఠాలు చెప్పడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. 21వ శతాబ్దపు పిల్లల అవసరాలు ప్రస్తుతం పాఠశాలల్లో బోధిస్తున్న పద్ధతికి భిన్నంగా ఉన్నాయి. మార్కెట్లో కొత్త కొత్త ఆవిష్కరణలతోపాటు రోబోటిక్స్ ప్రారంభించడంతో ఉద్యోగ స్వభావం మారుతోంది. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ మేరకు రాబోయే 15-20 ఏళ్లలో పిల్లలకు ప్రయోజనకరంగా ఉండే అభ్యాసం ఎలా కొనసాగుతుందనే దానిపై నా పరిశోధన సాగింది. స్టాటిక్ పాఠ్యాంశాల నుంచి పిల్లల ఆలోచనను మార్చడానికి ప్రయత్నిస్తున్నాం. టెక్నాలజీ ఉపయోగించుకుని ప్రాక్టికల్‌గా నేర్పించే బోధన పద్ధతిలో పిల్లలకు పాఠ్యాంశాల కాన్సెప్ట్స్ ఈజీగా అర్థమవుతుంది. మా మోడల్ వల్ల 26వేల మందికి పైగా పిల్లలు ప్రయోజనం పొందుతున్నారు’ – సాజిద్
2019లో సాజిద్ వినూత్న విధానానికి జార్ఖండ్ ప్రభుత్వం బెస్ట్ ఇన్నోవేటివ్ ఐడియా స్కూల్ అవార్డు అందించింది. ప్రస్తుతం పాఠ్యపుస్తకం, గోడలు లేని ఓపెన్-ఎయిర్ స్కూల్‌ను స్థాపించాలని అతను లక్ష్యంగా పెట్టుకున్నాడు. అక్కడ పిల్లలకు పుస్తకాల భారం ఉండదు. వారి చుట్టూ ఉన్న వస్తువులను ఉపయోగించి, బోధకుల జీవితానుభవాల నుంచి పాఠాలు నేర్పుతారు. గుమ్లా, పాలము, కోడెర్మా, హజారీబాగ్, రామ్‌గఢ్, జంషెడ్‌పూర్, ధన్‌బాద్ సహా బిహార్‌లోని కొన్ని జిల్లాల్లో 120కి పైగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు సాజిద్ అనుసరిస్తున్న టీచింగ్ మోడల్ స్వీకరించడం విశేషం.