వసతులు కల్పించండి.. ఆందోళనకు దిగిన స్కూల్ విద్యార్థులు

by Sridhar Babu |
వసతులు కల్పించండి.. ఆందోళనకు దిగిన స్కూల్ విద్యార్థులు
X

దిశ, కామేపల్లి: కామేపల్లి మండలం బాసిత్ నగర్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో శనివారం మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. బాసిత్ నగర్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్నాయి. ఇక్కడ 1 నుండి 10వ తరగతి వరకు 250 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలలో సగానికిపైగా ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. దీంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. పాఠశాలలకు సంబంధించి ఏడు సబ్జెక్టులకు ముగ్గురు మాత్రమే ఉపాధ్యాయులు ఉండగా.. నాలుగు ఖాళీలు ఉన్నాయి. దీంతో తరగతులు సక్రమంగా జరగకపోవడం, పది తరగతి గదులకు గాను ఐదు తరగతి గదులు మాత్రమే ఉండడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. దీంతో పాటు పాఠశాలలో 250 మంది విద్యార్థులకు రెండు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. మధ్యాహ్న భోజనం మెనూ కూడా సక్రమంగా అమలు కావడం లేదంటూ విద్యార్థులు ఆగ్రహానికి గురై ఆందోళనకు దిగారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు, తరగతి గదులు, ఉపాధ్యాయుల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed