ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్లకు హెచ్‌డీఎఫ్‌సీ రూ. 1 లక్ష స్కాలర్షిప్

by Disha Web Desk 17 |
ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్లకు హెచ్‌డీఎఫ్‌సీ రూ. 1 లక్ష స్కాలర్షిప్
X

స్కాలర్షిప్: వెనుకబడిన విద్యార్థుల చదువులను కొనసాగించడానికి వారికి ఆర్థికంగా సహాయం చేసేందుకు హెచ్‌డీఎఫ్‌సీ బాద్‌తే స్కాలర్షిప్ అందిస్తోంది. ఎంపిక చేసిన అభ్యర్థులకు నిర్ణీత సమయంలో అదనంగా మెంటర్షిప్, కెరీర్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్ లను కూడా అందిస్తుంది. ఈ స్కాలర్షిప్‌ను విద్యార్థులు అకడమిక్ ఫీజులకు, ట్యూషన్ ఫీజు, హాస్టల్, పుస్తకాలు, స్టేషనరీ వంటి ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు.

అర్హత:

12వ తరగతి పూర్తయి, గుర్తింపు పొందిన సంస్థల్లో ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న వారు అర్హులు. అవి బిటెక్, ఎంబిబిఎస్, బిఆర్క్, నర్సింగ్, బిఏ ఎల్ఎల్‌బి, ఫ్యాషన్, బిబిఏ, బిసిఏ...

గత బోర్డు పరీక్షల్లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.

కుటుంబ వార్షిక ఆదాయం రూ. 6 లక్షలలోపు ఉండి ఉండాలి.

భారతీయ పౌరులు అయి ఉండాలి.

స్కాలర్షిప్ మొత్తం: రూ. 100,000

డాక్యుమెంట్స్:

పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్

గత బోర్డు పరీక్షల మార్క్స్ షీట్.

ఐడీ ప్రూఫ్

ప్రస్తుత ఏడాది అడ్మిషన్ ప్రూఫ్

దరఖాస్తు దారుని బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్

ఇన్‌కమ్ ప్రూఫ్

అఫిడవిట్..

చివరి తేదీ: జనవరి 31, 2023.

వెబ్‌సైట్: https://www.buddy4study.com



Next Story

Most Viewed