- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Powergrid Corporation: రాత పరీక్ష లేకుండా ఇంజినీర్ ఉద్యోగాలు.. నెలకు లక్షకు పైగా జీతం..!
దిశ, వెబ్‌డెస్క్: గురుగ్రామ్(Gurugram)లోని ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(PGCIL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా దేశ వ్యాప్తంగా వివిధ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ట్రైనీ ఇంజినీర్(Trainee Engineer) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.powergrid.in/en/job-opportunities/ ద్వారా ఆన్‌లైన్(Online) విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 19 డిసెంబర్ 2024.
పోస్టు పేరు, ఖాళీలు:
ట్రైనీ ఇంజినీర్ - 22
విద్యార్హత:
కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్/ బీఎస్సీ(ఇంజినీరింగ్) పూర్తి చేసి ఉండాలి. అలాగే గేట్-2024 స్కోర్ తప్పనిసరిగా ఉండాలి.
వయోపరిమితి:
ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు వయసు 19 డిసెంబర్,2024 నాటికి 28 ఏళ్లకు మించి ఉండకూడదు.
ఎంపిక ప్రక్రియ:
గేట్-2024 స్కోర్, గ్రూప్ డిస్కషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు:
జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ. 500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
పే స్కేల్:
ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 30,000 నుంచి రూ.1,20,000 వరకు జీతం ఉంటుంది.