తెలంగాణలో మరో మూడు రోజులు ఓ మోస్తారు వర్షాలు

by M.Rajitha |
తెలంగాణలో మరో మూడు రోజులు ఓ మోస్తారు వర్షాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల తెలిక పాటి ఓ మోస్తారు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలోని ఈశాన్య జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వివరించారు. తూర్పు అగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపిడనం, కోస్టల్ కర్ణాటక మీదుగా పవనాలు తెలంగాణ మీదికి రావడం ద్వారా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. హైదరాబాద్ రాబోయే రెండు రోజులు మబ్బు పట్టిన వాతావరణం ఉంటుందని తెలిపారు. గురువారం హైదరాబాద్ లో వర్షం కురిసే అవకాశం ఉందని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed