అమరావతి ఎంపీకి సుప్రీంలో ఊరట

by Shamantha N |   ( Updated:2021-06-22 04:32:50.0  )
అమరావతి ఎంపీకి సుప్రీంలో ఊరట
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్‌కు సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. ఎన్నికల అఫిడవిట్‌లో ఆమె తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించారంటూ ముంబై హైకోర్టులో ప్రత్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ నెల 9న ఆమె కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నవనీత్ కౌర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌పై ఇవాళ వజస్టిస్ వినీత్ సరన్, జస్టిస్ దినేశ్, జస్టిస్ మహేశ్వరితో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా నవనీత్ కౌర్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినవారందరికీ నోటీసులు జారీ చేసింది. ఆమె కుల ధ్రువీకరణ పత్రానికి సంబంధించి తగిన ఆధారాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే విధించింది. కాగా గత లోక్‌సభ ఎన్నికల్లో అమరావతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆమె గెలుపొందారు.

Advertisement

Next Story