ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శంకర్

by Shyam |   ( Updated:2021-09-12 00:46:08.0  )
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శంకర్
X

దిశ, భూపాలపల్లి : కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా భూపాలపల్లి జిల్లా గణపురం మండలానికి చెందిన దూడపాక శంకర్ నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు జారీ చేసింది. గణపురం మండల కేంద్రానికి చెందిన దూడపాక శంకర్ గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పని చేస్తున్నారు. గతంలో గణపురం సర్పంచ్‌గా, జడ్పీటీసీగా పనిచేశారు. ఇటీవల జరిగిన జడ్పీటీసీ ఎన్నికలలో భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసారు.

భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడి టీఆర్ఎస్‌లోకి వెళ్లినప్పటికీ, దూడపాక శంకర్ మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ ఆయనకు కాంగ్రెస్ పార్టీ అట్రాసిటీ కమిటీ ఉపాధ్యక్షుడుగా నియమించింది. ఆయన నియామకం పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

Advertisement

Next Story