- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జొన్నవిత్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
దిశ, క్రైమ్‌బ్యూరో: ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుపై నాంపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ, ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ చట్టాల ప్రకారం కేసు నమోదైంది. లాక్‌డౌన్ నేపథ్యంలో సామాజిక దూరంపై జొన్నవిత్తుల ఓ కవితను రచించి, ఆలపించి సోషల్ మీడియాలో ఏప్రిల్ 14న పోస్ట్ చేశారని, ఆ కవిత… షెడ్యూల్డ్ కులాల సభ్యులతో ఉన్నత కులాలు సామాజిక సంబంధాన్ని మానుకునేలా ఉందని, సమాజంలో కుల దుష్ట సంకల్పాలను వ్యాప్తి చేసేలా సోషల్ మీడియాను ఉపయోగించారని మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు బత్తుల రాంప్రసాద్ మే20న నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జొన్నవిత్తుల రచన కారణంగా ఎస్సీ, ఎస్టీలు తీవ్ర మానసిక వేదనకు గురైనట్టు పేర్కొన్నారు. బత్తుల రాంప్రసాద్ ఫిర్యాదు మేరకు జొన్నవిత్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు మానవ హక్కుల పరిరక్షణ (ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ చట్టాల ప్రకారం కేసులు (ఎఫ్ఐఆర్ 105/2020) నమోదు చేశారు.