ఒంటెలకు అందాల పోటీ .. విజేతకు $66 మిలియన్ ఆఫర్ చేసిన నిర్వాహకులు

by Shyam |   ( Updated:2021-12-12 02:56:38.0  )
ఒంటెలకు అందాల పోటీ .. విజేతకు $66 మిలియన్ ఆఫర్ చేసిన నిర్వాహకులు
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా మహిళలు లేదా పురుషులకు బ్యూటీ కాంటెస్ట్స్ నిర్వహిస్తుంటారు. ఈ పోటీల్లో పాల్గొనే కంటెస్టెంట్ల బాడీ పార్ట్స్.. ఒకవేళ బ్యూటీ స్టాండర్డ్స్‌కు తగ్గట్టుగా లేకుంటే ఆ లోపాలను సవరించేందుకు రకరకాల కృత్రిమ పద్ధతులను ఆశ్రయిస్తుంటారు. అయితే సౌదీ అరేబియాలో జంతువులు కూడా ఇలాంటి అన్‌రియలిస్టిక్ బ్యూటీ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నాయి. ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే కింగ్ అబ్దుల్ అజీజ్ కేమెల్ ఫెస్టివల్‌లో పాల్టొనే వేలాది ఒంటెల పెదవులు, మూపురం ఆకారంగా విజేతను నిర్ణయిస్తారు. కాగా ఒంటెల బ్యూటీ ఫీచర్స్‌ను మెరుగుపరిచేందుకు యజమానులు ఈ మూగజీవాలకు కాస్మెటిక్ సర్జరీ, బొటాక్స్ ఇంజెక్షన్లు చేయిస్తున్నారని తేలింది.

కాగా కాంపిటీషన్స్‌ కోసం ఒంటెల అందాన్ని పెంచేందుకు ఆశ్రయిస్తున్న పద్ధతులపై సౌదీ అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే కాస్మెటిక్ సర్జరీ కి గురైన 40కి పైగా ఒంటెలను అందాల పోటీ నుంచి నిషేధించారు. వివరాల ప్రకారం.. ఫెస్టివల్‌లో పాల్గొన్న చాలా మంది తమ ఒంటెల పెదవులు, ముక్కులను సర్జరీ ద్వారా వెడల్పు చేయడంతో పాటు వాటి కండరాలు పెద్దగా కనిపించేందుకు హార్మోన్లు, రబ్బర్ బ్యాండ్స్ ఉపయోగించారు. అంతేకాదు తలలు, పెదవులు పెద్దవిగా చేసేందుకు బొటాక్స్‌ను ఇంజెక్ట్ చేసినట్లు తెలిసింది.

రబ్బర్ బ్యాండ్స్‌తో శరీర భాగాలను విస్తరించడం, ముఖం అందంగా కనిపించేందుకు ఫిల్లర్స్ ఉపయోగించడం వంటి ఇతరత్రా అనేక చర్యలు ఇందులో భాగంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కాంపీటీషన్‌కు జడ్జిలుగా వ్యవహరిస్తున్న వ్యక్తులు.. ఈ ఏడాది ఒంటెల్లో కాస్మెటిక్ చేంజెస్‌ను గుర్తించేందుకు ‘స్పెషలైజ్డ్ అండ్ అడ్వాన్స్‌డ్’ టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని చెప్పారు.

అవకతవకలు, మోసపూరిత చర్యలకు పాల్పడిన ఒంటెల యజమానులకు కఠిన జరిమానాలు విధిస్తామని చెప్పారు.ఈ నెల ప్రారంభంలో ఈ ఫెస్టివల్ మొదలవగా.. అందమైన ఒంటెను కలిగిన యజమానికి $ 66 మిలియన్ ప్రైజ్ మనీ దక్కుతుంది. కాగా ఒంటెల తలలు, మెడలు, మూపురం, దుస్తులతో పాటు భంగిమల ఆకారాన్ని బట్టి జ్యూరీ విజేతను నిర్ణయిస్తుంది.

ఉల్లాసవంతమైన ఆత్మహత్యకు.. సూసైడ్ క్యాప్సూల్..

Advertisement

Next Story