- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త సీఈవోగా శశిధర్ జగదీషన్!
దిశ, వెబ్‌డెస్క్: ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు కొత్త సీఈవోగా శశిధర్ జగదీషన్ పేరును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) ఆమోదించినట్టు తెలుస్తోంది. బ్యాంకు ప్రతిపాదనను ఆర్‌బీఐ సోమవారం సాయంత్రం తర్వాత ఆమోదించినట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రస్తుత సీఈవోగా ఉన్న ఆదిత్య పురి స్థానంలో జగదీషన్ నియమితులయ్యారు. అక్టోబర్‌లో ఆదిత్య పురి పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కొత్త సీఈవో ఎంపిక అనివార్యంగా మారింది. కాగా, కొత్త సీఈవో నియామకాన్ని హెచ్‌డీఎఫ్‌సీ ఛైర్‌పర్సన్ శ్యామలా గోపీనాథన్ ధృవీకరించారు. శశిధర జగదీషన్ 1996లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో చేరారు. ప్రస్తుతం హెచ్ఆర్ అడిషనల్ డైరెక్టర్‌గా, ఫైనాన్స్ హెడ్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
ఇక, 1994 ఏడాదిలో హెచ్‌డీఎఫ్‌సీ స్థాపించినప్పటి నుంచి బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా ఉన్న ఆదిత్య పురి.. 26 సంవత్సరాల సుధీర్ఘ కెరీర్ తర్వాత 69 ఏళ్ల వయసులో అక్టోబర్ 27న బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆదిత్య పురి..బాధ్యతల నుంచి వైదొలగిన వెంటనే తనకిష్టమైన గోల్ఫ్ ఆటలో నిమగ్నం అవనున్నట్టు తెలిపారు. ట్రెక్కింగ్ అభిరుచి అని, అడవి ప్రాంతాల్లో నడవడానికి ఇష్టపడతారని చెప్పారు. ఖాళీ సమయాల్లో సంగీతం వినడం ఆసక్తిగా ఉంటుందని చెప్పారు. కాగా, కొత్త సీఈవో వార్తల నేపథ్యంలో మంగళవారం మార్కెట్ ప్రారంభంలో హెచ్‌డీఎఫ్‌సీ షేర్ భారీగా లాభాల్లో దూసుకెళ్లింది.