- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్..
దిశ, ఏపీ బ్యూరో : తిరుమల శ్రీవారి దర్శనం కోసం సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియను టీటీడీ చేపట్టింది. శ్రీనివాస కాంప్లెక్స్‌లో సర్వదర్శనం టోకెన్లను భక్తులకు టీటీడీ అందజేసింది. కరోనా తీవ్రత నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సర్వదర్శనం టోకెన్లను టీటీడీ నిలిపివేసింది. సుమారు 5 నెలల విరామం తర్వాత సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సర్వదర్శనం కోసం ఉదయం నుంచి శ్రీనివాస కాంప్లెక్స్ వద్ద బారులు తీరారు. ఉదయం 6 గంటల నుంచి టీటీడీ సిబ్బంది సర్వదర్శనం టోకెన్లను జారీ చేసింది. రోజూ 2వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని టీటీడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి సర్వదర్శనం టోకెన్లకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ డిమాండ్ ఉంది. అయితే, కరోనా తీవ్రత నేపథ్యంలో ప్రయోగాత్మకంగా చిత్తూరు వాసులకు మాత్రమే టోకెన్లను అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.
- Tags
- chittoor