మావోయిస్ట్ జగన్ పేరుతో సర్పంచ్‌కు మరో లేఖ.. అడిగింది చేయాలంటూ..

by Shyam |   ( Updated:2021-12-18 06:01:41.0  )
letter
X

దిశ, కొండపాక: సిద్దిపేట జిల్లాలో మావోయిస్టు జగన్ పేరుతో సర్పంచ్‌కు మళ్లీ బెదిరింపు లేఖ వాట్సప్‌లో వచ్చింది. వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగండ్ల గ్రామ సర్పంచ్ గూడెపు లక్ష్మారెడ్డికి ఫోన్‌లో శుక్రవారం జగన్ అనే పేరుతో మావోయిస్టులు బెదిరింపు ఫోన్ కాల్ చేశారు. సర్పంచ్‌ను మావోయిస్టు పార్టీ ఫండ్ 20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనితో సర్పంచ్ లక్ష్మారెడ్డి జగన్ పేరుతో బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే సర్పంచ్‌కు మరోసారి శనివారం ఉదయం వాట్సప్‌లో జగన్ పేరుతో బెదిరింపు లేఖ వచ్చిందని తెలిపారు. సోమవారం వరకు ఆ వ్యక్తి ఎవరో తెలియకపోతే నాకు సెక్యూరిటీ కావాలని కోరుతూ హైకోర్టు‌లో అప్పీల్ చేస్తానని అన్నారు.

Advertisement

Next Story