మొద్దు నిద్రలో సర్పంచ్, అధికారులు. 20 రోజులు గా అంధకారం లో గ్రామం.

by  |
మొద్దు నిద్రలో సర్పంచ్, అధికారులు. 20 రోజులు గా అంధకారం లో గ్రామం.
X

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాధవాని పల్లి గ్రామంలో గత 20 రోజులకు పైగా గ్రామంలో విద్యుత్ సరఫరా, వీధిలైట్లు లేక ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చలికాలంలో చలి తీవ్రత, కరెంటు లేక ప్రజలు నానా అవస్థలు పడుతూ అంధకారంలో గ్రామం ఉండడం వలన ప్రజలు బయటకు వెళ్లాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. గ్రామంలో కరెంటు లేక పోవడం వల్ల విషసర్పాలు తిరుగుతున్నాయని, తద్వారా ప్రజలు రాత్రి సమయంలో బయటకు వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారన్నారు.

ఈ సమస్య పై గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, మండల పంచాయతీ అధికారికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే పాపన లేదని, ప్రజాప్రతినిధులు, అధికారులు మొద్దు నిద్ర లో మునిగి తేలుతున్నారని గ్రామస్తులు మండిపడ్డారు. ఇట్టి విషయం పై ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్ళిన పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామంలో ఉన్న సమస్యలు, కరెంటు, విద్యుద్దీపాల సమస్య వారం రోజుల్లోగా పరిష్కరించకపోతే ఎంపీడీవో ఆఫీస్ ముట్టడి చేస్తామని గ్రామ ప్రజలు హెచ్చరించారు. గ్రామ సమస్యల పైన జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తామన్నారు.

Advertisement

Next Story