ఊరు మనది.. ట్రాక్టర్ నాది!

by Shyam |
ఊరు మనది.. ట్రాక్టర్ నాది!
X

దిశ, రంగారెడ్డి: పేరు భార్యది.. పెత్తనం భర్తది. కొంతమంది మహిళా ప్రజాప్రతినిధులు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. తప్పనిసరి అయితేనే బయటకు వస్తున్నారు. లేదంటే అంతే. చాలా చోట్ల సభలు సమావేశాలు, సమీక్షల్లో భర్తల హవా మాత్రమే కొనసాగుతోన్నది. ఇది జగమెరిగిన సత్యం. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవొద్దని పలు సందర్భాల్లో ఉన్నత అధికారులు సూచించారు. అంతేకాదు భార్య పదవులపై భర్తలు పెత్తనం చేలాయించొద్దని, పాలన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవొద్దని పేర్కొన్నారు. అయినా కూడా కొంతమంది తీరులో మార్పులేదు.

స్పష్టమైన ఆధారాలు..

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ఫరూక్ నగర్ మండలం వెలిజర్ల గ్రామ సర్పంచ్ అమృతమ్మ భర్త సీనియర్ నేత, మాజీ ఎంపీటీసీ నరసింహారెడ్డి మాత్రం భార్య పదవిని అడ్డు పెట్టుకుని అధికారం చేలాయిస్తున్నట్టు గ్రామస్తులు స్పష్టమైన ఆధారాలతో కూడిన ఓ వీడియోను మీడియాకు సమర్పించారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రభుత్వ ట్రాక్టర్‌ను తన సొంత కార్యక్రమాలకు వాడుకుంటున్నారు. ట్రాక్టర్‌‌లో వరి ధాన్యం వేసుకొని ఇష్టారాజ్యంగా సొంత పనులకు వాడుకుంటుంగా వీడియో తీశారు. ట్రాక్టర్ వెంటే సర్పంచ్ భర్త నరసింహారెడ్డి స్కూటీపై ట్రాక్టర్ కు కాపలాగా వస్తూ ఎవరైనా ప్రశ్నిస్తే ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని గ్రామస్తులు అశోక్ రెడ్డి, రఘు, గణేష్ గౌడ్, గోపాల్, శేఖర్ యాదవ్, నర్సింహా తదితరులు విమర్శించారు.

Tags: Rangareddy, Tractor, Own Work, Veljerla Sarpanch, Narasimha Reddy

Advertisement

Next Story

Most Viewed