- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సూపర్ హీరో సరసన సారా
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో విక్కీ కౌశల్..‘ఉరి’ సినిమాతో మంచి గుర్తింపు పొందగా, ఆ తర్వాత నుంచి తన కెరీర్‌కు ఉపయోగపడే చిత్రాలు చేస్తూ బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్స్‌లో భాగమవుతున్నాడు. ఈ క్రమంలోనే ‘ది ఇమ్మోర్టల్ అశ్వథ్థామ’ పేరుతో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచగా, ఆ సూపర్ హీరోకు జోడిగా నటించే అవకాశాన్ని బాలీవుడ్ లక్కీ బ్యూటీ సారా అలీ ఖాన్ కొట్టేసిందని బాలీవుడ్ టాక్.
సారా తను చేసిన నాలుగు చిత్రాలతో పర్‌ఫెక్ట్ కమర్షియల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకోగా, తన టాలెంట్‌ను బ్యాలెన్స్ చేస్తూ, సినిమాకు కావాల్సిన మాస్‌మసాలాను ప్రేక్షకులకు అందిస్తోంది. ఈ క్రమంలోనే సారా తమ ‘అశ్వథ్థామ’ సూపర్ హీరోకు పరెఫెక్ట్ హీరోయిన్‌గా మేకర్స్ భావించి ఆమెను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంట్రెస్టింగ్ పెయిర్ తెరపై ఎలాంటి అద్భుతాలు చేస్తుందో వేచి చూడాలి. మహాభారతం నుంచి వచ్చిన పాత్ర ఆధారంగా ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నామని, విజువల్ ఎఫెక్ట్స్‌కు ఎంతో ప్రాధాన్యముండటంతో పాటు, దీన్ని మూడు భాగాలుగా తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నామని నిర్మాతలు తెలపగా, ఈ సినిమా ఏప్రిల్ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తుండగా, రోన్నీ స్క్రూవాలా నిర్మిస్తున్నారు. ‘ఉరి’ తర్వాత ఈ ముగ్గురి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.