- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ స్కూల్ విద్యార్థిగా గర్వపడుతున్నా: సంజన
దిశ, వెబ్‌డెస్క్ :
ఎడ్యుకేషన్ ఐకాన్ ఢిల్లీ మోడర్న్ స్కూల్ వందేళ్ల వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ‘100 ఇయర్స్ ఫర్ మోడర్న్ స్కూల్’ పేరు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉండగా.. వందేళ్ల చరిత్ర కలిగిన స్కూల్‌లో తను చదువుకోవడం గర్వంగా ఉందని తెలిపింది బాలీవుడ్ హీరోయిన్ సంజనా సంఘీ. ‘వేదికపై చర్చకు నన్ను అనుమతించి.. అకాడెమియా పట్ల తనకున్న ప్రేమను, సామాజిక కార్యక్రమాల పట్ల తన అభిరుచిని గ్రహించినందుకు మోడర్న్ స్కూల్‌కు ధన్యవాదాలు తెలిపింది సంజన.
2014 బ్యాచ్‌కు చెందిన సంజన.. ‘అమ్మాయిలు, అబ్బాయిల మధ్య భేదం, ఎక్కడి నుంచి వచ్చారనే తేడాలేవీ చూపకుండా.. నాలుగు గోడల తరగతి గదిలో లైఫ్‌ను లీడ్ చేయగల సామర్థ్యాన్ని పెంపొందించిన మోడర్న్ స్కూల్‌కు థాంక్స్ చెప్పింది. బ్లూ కలర్ యూనిఫార్మ్ మాకు కవచం లాంటిదన్న ఆమె.. ఈ స్కూల్ తనను తాను కనుగొనేందుకు సహాయం చేసిందన్నారు. ఫ్రెండ్‌షిప్‌కున్న పవర్‌ను అర్థమయ్యేలా చేసిన స్కూల్ మెమొరీస్‌ను లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటానని తెలిపింది. టీచర్స్ తనను అర్థం చేసుకున్నారని.. ఇంతకు ముందెన్నడూ లేనివిధంగా నన్ను నేను కనుగొనేలా చేశారని చెప్పింది. కలలో కూడా ఊహించని అవకాశాలు ఇచ్చిన ఢిల్లీ మోడర్న్ స్కూల్‌లో విద్యార్థిగా గర్వపడుతున్నానని చెప్పింది సంజన.