SRH జట్టుపై సానియా మీర్జా తండ్రి ఫైర్

by Shyam |
Sania Mirzas father Imran Mirza
X

దిశ, వెబ్‌డెస్క్: చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా బుధవారం రాత్రి హైదరాబాద్, బెంగళూరు మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘటన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. బెంగళూరు విధించిన స్వల్ప 150 పరుగుల టార్గెట్‌ను ఛేదించడంలో హైదరాబాద్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులే చేసింది. దీంతో ఈ మ్యా్చ్‌లో హైదరాబాద్ జట్టు పేలవ ప్రదర్శనలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

SRH ఓటమిపై టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా ట్విట్టర్ ద్వారా స్పందించారు. నిజానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో స్థానిక ఆటగాళ్లే లేకపోవడం విమర్శలకు దారి తీసింది. పేరుకే హైదరాబాద్ జట్టు అయిన స్థానిక ఆటగాళ్లకు ప్రాతినిధ్యమే లేకుండా పోయిందన్నారు. ఐపీఎల్‌ మ్యాచ్‌లకు హైదరాబాద్‌ వేదిక కాకపోవడంపైనా ఆయన విచారం వ్యక్తం చేశారు. చూస్తుంటే హైదరాబాద్ జట్టు కొన్ని విజయాలతోనే ఐపీఎల్‌లో తన ప్రస్థానాన్ని ముగించేలా కనిపిస్తోందన్నారు.

Advertisement

Next Story

Most Viewed