శాండల్‌వుడ్ సింగర్ సూసైడ్

by  |
శాండల్‌వుడ్ సింగర్ సూసైడ్
X

శాండల్‌వుడ్ సింగర్ సుస్మిత సోమవారం ఆత్మహత్య చేసుకుంది. తన ఇంట్లోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అదనపు కట్నం తీసుకురావాలంటూ అత్తింటివారు పెడుతున్న వేధింపులకు తాళలేక సూసైడ్ చేసుకుంది. చనిపోయే ముందు తన సూసైడ్ నోట్‌ను తమ్ముడికి మెస్సేజ్ చేసింది.

సింగర్ సుస్మిత మంచి అవకాశాలు దక్కించుకుంటూ ఎదుగుతున్న క్రమంలో ఇలా సూసైడ్ చేసుకోవడం ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే సూసైడ్ నోట్‌లో తన బాధలను తల్లికి తెలిపింది సుస్మిత. ‘అమ్మా నా భర్త తరపు బంధువులు నన్ను వేధిస్తున్నారు .. నేను చేసిన తప్పునకు నేనే శిక్ష అనుభవించాలి… అందుకే చనిపోతున్నా.. కానీ నా భర్తతోపాటు ఎవరినీ వదలొద్దు అమ్మా.. నాకు పడిన శిక్షే వాళ్లకు పడాలి’ అంటూ నోట్ రాసి తమ్ముడికి సెండ్ చేసింది. ఆ నోట్‌ను అమ్మకు చూపించాలని కోరింది. దీంతో భర్త, అత్తమామలతోపాటు బంధువులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు సుస్మిత పుట్టింటివారు. తమ బిడ్డ మరణానికి కారణమైనవారిని శిక్షించాలని కోరారు. సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.


Next Story

Most Viewed