- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇసుక మాఫియా ముఠా అరెస్టు
దిశ, క్రైమ్‌బ్యూరో: అక్రమంగా ఇసుక వ్యాపారం చేస్తున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్ వివరాలను వెల్లడించారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాములకు చెందిన బాచుపల్లి మధుకర్.. జూన్ 10న ములుగు జిల్లా మాల్యాల నుంచి తన డ్రైవర్ రామకృష్ణతో కలిసి అక్రమంగా ఇసుక తీసుకువస్తుండగా ఘట్కేసర్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా టీఎస్ఎండీసీఎల్ ఉద్యోగుల ద్వారా మాల్యాల నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్టు ఒప్పుకున్నాడు. ములుగు జిల్లా మాల్యాల గ్రామ పరిధిలో ఇసుక కాంట్రాక్టర్ పొందిన బోను కిరణ్ కుమార్ ద్వారా గతంలో ఖమ్మం జిల్లా మణుగూరు ఇసుక క్వారీలో పనిచేసిన అనుభవం ఉన్న రాజశేఖర్ సహా తనకు తెలిసిన వారిని పనిలో చేర్చుకొని దందా చేస్తున్నాడు. మాల్యాలలో టీఎస్ఎండీసీ ఉద్యోగులతో సంప్రదించి నకిలీ వే బిల్లులు, రవాణా పాస్ లను సృష్టించడం తదితర అక్రమ రవాణ పద్దతులను రాజశేఖర్ మిగతావారికి చెప్పాడు.
ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారా ఇసుక పొందడం కష్టమవుతోందని గ్రహించిన ఈ ముఠా సభ్యులు నేరుగా ప్రజల నుంచి ఆర్డర్లు సేకరించి, లారీలను నేరుగా క్వారీలోకి అనుమతిండచం, ఓవర్ లోడ్ గా ఇసుకను లోడ్ చేయడం ప్రారంభించారు. ఇలా ఒక్కో వాహనానికి రూ.25 వేలతో ప్రతిరోజూ 30లారీలను అక్రమంగా అనుమతించేవారు. 2020 మార్చి నుంచి ఈ వ్యాపారం చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు మధుకర్ ఇచ్చిన సమాచారం మేరకు కేసును దర్యాప్తు చేస్తున్న ఘట్‌కేసర్ పోలీసులు, ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు స్థానిక ములుగు ఎస్పీ సంఘ్ రాంసింగ్ పాటిల్ సహకారంతో ఏటూరునాగారంలో బోను కిరణ్ కుమార్, కమ్మచిచు రాజా శేఖర్, పర్వతాల నవీన్ కుమార్, కొండా మల్లిఖర్జున్, మంతెన భార్గవ్, గడ్డం లక్ష్మణ్‌ను అరెస్ట్ చేశారు. వే బిల్లులు సృష్టించిన చాగంటి నవీన్ పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి రూ.3.20 లక్షల నగదు, పోర్టబుల్ ప్రింటర్, లాప్‌టాప్, ఫేక్ వే బిల్లు, బిల్లింగ్ రోల్, 9 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.