- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇసుక మాఫియా హల్‌చల్.. తప్పుడు నివేదికలతో అనుమతులు..
దిశ, బూర్గంపాడు : బూర్గంపాడు మండలం సోంపల్లి పంచాయతీ పరిధిలో అక్రమ ఇసుక దందా కొనసాగుతోంది. రైతుల పొలాల్లో ఇసుక మేటలు వేసి కొంత మంది అధికార పార్టీ నాయకులు ఏపీకి చెందిన ఇసుక మాఫియాతో కుమ్మక్కై రెవెన్యూ, మైనింగ్, వ్యవసాయ, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులను తప్పుదోవ పట్టించి, తప్పుడు నివేదికలతో కోర్టు ద్వారా అనుమతులు పొంది నిబంధనలకు విరుద్ధంగా ఇసుక ర్యాంపు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వారిని అడిగే వారే లేరని ఏకంగా లారీలకు సంబంధించిన వాళ్ల వద్ద ఇసుక మాఫియా నిలువు దోపిడీ చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం వద్ద ఇసుక కొరకు 25 టన్నులకు రూ.10,800 లు డీడీ తీసి ఇసుకను తరలిస్తారు.
కాగా, ర్యాంపు వద్ద నిర్వాహకులు లారీల వారి వద్ద అదనంగా వసూలు చేస్తున్నారు. లారీ.. సీరియల్‌కి రూ.300, లోడింగ్‌కు రూ.1500, టార్పాలిన్‌కు రూ. 600, గ్రామ పంచాయతీకి మరో రూ.150.. ఇలా అదనంగా ఒక్కో లారీ నుంచి రూ. 2,550 వసూలు చేస్తున్నారు. ఈ అదనపు వసూలుపై లారీ ఓనర్లు గగ్గోలు పెడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇసుక డీడీపై ఎన్ని టన్నుల ఇసుక బుక్ చేసుకుంటే అంతవరకే కట్టాలని, ఎవరికీ ఒక రూపాయి అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని చెబుతోంది.
కానీ, బూర్గంపాడు మండలం సోంపల్లి ర్యాంపు వద్ద మేము అడిగింది ఇస్తేనే మీ లారీలు లోడ్ చేస్తామని.. లేదంటే లారీల్లో ఇసుక లోడ్ చేయమని తెగేసి చెబుతున్నారు. అయితే.. అదనంగా డబ్బులు ఇవ్వమని చెప్పిన లారీల్లో ఇసుక లోడ్ చేయకుండా పక్కన పేట్టిస్తున్నారని లారీ డ్రైవర్లు పేర్కొంటున్నారు. అసలు ఇసుక ర్యాంపులకు సంబంధించిన అధికారులు ఇసుక ర్యాంపు వద్ద ఉంటున్నారా లేదా.? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని ఇసుక ర్యాంపు వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలు లారీ డ్రైవర్ అసోసియేషన్ సంఘాలు కోరుతున్నాయి.