- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భారీగా ఇసుక డంపులు స్వాధీనం
దిశ, ఆదిలాబాద్: కొంతమంది సిమెంట్ ఇటుకలు తయారు చేసే వ్యాపారులు గోదావరి నుంచి అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నట్లు రామగుండం సీపీకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు.. మంచిర్యాల జిల్లా మాదాపూర్ గ్రామ సమీపంలో టాస్క్‌ఫోర్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా ఇసుక డంపులను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా దాదాపు 300 ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేశారు. పోలీసులను గమనించిన అక్రమార్కులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ వ్యవహారం ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఒక ట్రాక్టర్ ఇసుక నాలుగు నుంచి 5 వేల ధర పలుకుతున్న సమయంలో.. ఏకంగా మూడు వందల ట్రాక్టర్ల ఇసుక పట్టుబడటం స్థానికంగా సంచలనమే సృష్టించింది. దీని వెనుక బడా కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇసుక మాఫీయాపై కఠినంగా వ్యవహరిస్తామని రామగుండం సీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడిన ఎంతటి వారినైనా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తామని ఆయన హెచ్చరించారు.