ప‌వ‌న్‌కి సంచయిత డిమాండ్ ఇదే…

by Anukaran |   ( Updated:2020-09-11 05:13:50.0  )
ప‌వ‌న్‌కి సంచయిత డిమాండ్ ఇదే…
X

దిశ, ఏపీ బ్యూరో : హిందూయేతర వ్యక్తిగా తనను చిత్రీకరించే ప్రచారాలను నమ్మవద్దంటూ సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు, మన్సాస్‌ ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌ సంచయిత గజపతిరాజు శుక్రవారం ఓ ప్రకటనలో పవన్కల్యాణ్కు హితవు పలికారు. తన తల్లిదండ్రులు హిందువులని, తాను కూడా హిందూ ధర్మాన్ని పాటిస్తానని స్పష్టం చేశారు. తాను అన్నిమతాలను గౌరవిస్తానని పేర్కొన్నారు.

సింహాచలం దేవస్థానం, మన్సాస్‌ ట్రస్టు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అక్రమాలు బయటకు తీస్తున్నందునే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, కాబట్టి తన గురించి చేసిన వ్యాఖ్యలను సరిదిద్దుకోవాలని పవన్‌కు సూచించారు. మరో ప్రకటన విడుదల చేయడమో లేదా తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వడమో చేయాలన్నారు. హుందాతనం ఉన్న వ్యక్తిగా పవన్‌ నుంచి ఇదే ఆశిస్తున్నానంటూ గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

Advertisement

Next Story