- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
కన్నడ నటిపై చేయి చేసుకున్న కాంగ్రెస్ లీడర్
దిశ, వెబ్‌డెస్క్: కన్నడ నటి సంయుక్త హెగ్డేపై జరిగిన దాడి వైరల్ అయింది. కాంగ్రెస్ లీడర్ కవిత రెడ్డి.. సంయుక్త అండ్ ఫ్రెండ్స్‌ను అసభ్యంగా దూషించి, వారిపై చేయిచేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పైగా ఎటాక్ చేసిన కవిత రెడ్డినే పోలీసులు సపోర్ట్ చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
అసలేం జరిగిందనే విషయాన్ని ఓ వీడియో ద్వారా పోస్ట్ చేసిన హీరోయిన్ సంయుక్త.. తప్పు ఎవరిదో మీరే తేల్చాలని కోరింది. బెంగుళూరులోని ‘అగారా లేక్’లో హూప్స్ ప్రాక్టీస్ కోసం ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లింది సంయుక్త. ముగ్గురు కలిసి ప్రాక్టీస్ చేస్తుండగానే అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ లీడర్ కవిత రెడ్డి.. మీరేమైనా కాబరెట్ డ్యాన్సర్స్ హా? ఇలాంటి బట్టలు వేసుకున్నారు అంటూ తిట్టడం స్టార్ట్ చేసింది. ఇలాంటి బట్టలు వేసుకోవడం వల్ల మీకేదైనా జరిగితే.. ఏడ్చుకుంటూ మాలాంటి వాళ్ల దగ్గరికి రావద్దని చెప్పింది. ఆ తర్వాత సంయుక్త ఫ్రెండ్‌పై కూడా చేయి చేసుకున్న కవిత రెడ్డి.. తన గ్యాంగ్‌తో వెంటనే వీళ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టింది. ఎలాగూ శాండల్‌వుడ్‌లో డ్రగ్స్ కేసు దర్యాప్తు జరుగుతుంది కాబట్టి.. దానికి ముడిపెడుతూ తమ తప్పును కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది.
పైగా పోలీసులు కూడా సమస్యను స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలని, వీడియో షూట్ చేయొద్దని కోరినట్లు తెలిపింది. నేరస్తులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారని చెప్పింది. ప్రత్యక్ష సాక్షులు జరిగిందంతా వివరించినా పోలీసులు పట్టించుకోలేదని.. కారణం లేకుండా హింసించే ప్రవర్తనను ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపింది. ఇలాంటి ఘటనలు పునరాృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది సంయుక్త.
ఈ రోజు మనం చేసే పనులపైనే దేశ భవిష్యత్తు ప్రతిబింబిస్తుందని.. అగారా సరస్సు వద్ద కవిత రెడ్డి తమ పట్ల ఎలా ప్రవర్తించింది చూడమని అభ్యర్థిస్తూ ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేసింది.
దీనిపై స్పందించిన సెలబ్రిటీలు.. సంయుక్తకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఎలాంటి బట్టలు ధరించాలన్న విషయంపై తిట్టడం, కొట్టడం లాంటివి ఇంట్లో చూసుకోవాలే తప్ప.. ఇలా పబ్లిక్‌గా చేయడం చాలా తప్పని చెప్తున్నారు. తనపై దాడి చేయడం సరికాదని చెప్తున్నారు.