- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చైతన్యతో సమంత విడాకులు ఫిక్స్.. భరణంగా అన్ని కోట్లు..?
దిశ, వెబ్‌డెస్క్: సమంత.. సమంత.. సమంత.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సామ్ పేరే గట్టిగా వినిపిస్తోంది. గత కొన్ని రోజులుగా అక్కినేని కోడలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న సామ్, చైతన్య విడాకులు తీసుకొంటున్నారు అనే వార్త ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయమై అక్కినేని ఫ్యామిలీ నోరు విప్పకపోయినా ఇందులో ఎంతోకొంత నిజమున్నది అనే వాస్తవం అందరికి తెలుస్తోంది. ఈ విషయాన్ని చెప్పకనే చెప్తోంది సమంత.. రోజు ఆమె పోస్ట్ చేసే పోస్టులు చూస్తుంటే ఈ విడాకులు సామ్ కి ఇష్టం లేనట్టే కనిపిస్తోంది. తప్పు చేశాను.. ఇద్దరు తప్పులు ఉన్నాయి అంటూ ఇన్ డైరెక్ట్ గా చై కి సంకేతాలు పంపిస్తున్నట్లే కనిపిస్తున్నాయి. ఇక తాజాగా అమ్మడు షేర్ చేసిన సద్గురు ప్రవచనం బాంబ్ లా పేలిందనే అనుకోవచ్చు.
సాధారణంగా ఎవరైనా తప్పు చేస్తే.. ఎవరి కర్మానా వారే పోతారు అనే అర్ధం వచ్చేలా మాట్లాడుతుండడం కామనే. తాజాగా సామ్ కూడా కర్మ గురించి, సిద్ధాంతాలు గురించి మాట్లాడడం సంచలనం సృష్టిస్తోంది. “ఈ ప్రపంచం ఏం చేసినా నీకు దాని విషయంలో ఛాయిస్ లేదు. కానీ నువ్వు ఏం చేశావో దానికి నువ్వు మాత్రమే బాధ్యుడవు.. ఇదే కర్మ అంటే!!” అంటూ కాస్త ఘాటైన అర్థం వచ్చే సద్గురు ప్రవచనాన్ని షేర్ చేసింది. ఇక ఈ ప్రవచనం అక్కినేని ఫ్యామిలీకి అనువుగా ఉందంటూ నెట్టింట అభిమానులు గుసగుసలాడేస్తున్నారు. మొన్నామధ్య బాలీవుడ్ నటుడు చై ని ఆకాశానికెత్తేసిన విషయం తెలిసిందే. దానికి కౌంటర్ గా సామ్ ఈ ప్రవచాన్ని పోస్ట్ చేసిందా..? తనను వదిలేయడం చై కర్మనా..? అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.
సామ్‌తో విడాకులు.. బాధగా ఉందంటూ చైతు కామెంట్స్
ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం సామ్- చై విడాకుల కేసు కౌన్సిలింగ్ స్టేజి దాటి భరణం స్టేజి వరకు వచ్చిందని తెలుస్తోంది. విడాకుల భరణంగా అక్కినేని ఫ్యామిలీ సామ్ కి భారీగానే ముట్టజెప్పనున్నారట. ఆమె స్థిర, చర ఆస్తులన్నీ కలిపి కొన్ని కోట్లు ఇచ్చేలా చూస్తున్నారట. ఇప్పటికే ఈ లావాదేవీలకు సంబంధించిన ప్రాసెస్ నడుస్తున్నట్లు టాక్. అంతేకాకుండా అమ్మడు ఎంత కలవాలని ప్రయత్నిస్తున్నా నాగ్ మళ్లీ సామ్ ని వెనక్కి రప్పించే ప్రయత్నం చేయడం లేదని తెలుస్తోంది. సామ్ కి ఎంత కావాలంటే అంత ఇచ్చి ఈ విడాకుల కేసును అతి త్వరలో ముగించాలని చూస్తున్నాడట.. ఈ విషయంలో చై కూడా తండ్రి మాటను గౌరవిస్తునట్లు తెలుస్తోంది. ఇక ఇదే నిజమైతే చై- సామ్ విడాకులకు నాగార్జుననే ప్రధాన కారణమని కొందరు నొక్కివక్కాణిస్తున్నారు. ఏదిఏమైనా సామ్ రియలైజ్ అయ్యి మళ్లీ వెనక్కి రావాలన్నా అందుకు అక్కినేని ఫ్యామిలీ ఒప్పుకొనేలా కనిపించడం లేదన్న మాట వాస్తవమే అనిపిస్తోందని చిత్రవర్గాలు గుసగుసలాడుతున్నాయి. మరి ఈ విడాకుల కేసు ఎప్పటికి ముగుస్తుందో చూడాలి.
- Tags
- Divorce