చిరు సినిమాలో చెర్రీ, సమంత జోడి?

by Shyam |
చిరు సినిమాలో చెర్రీ, సమంత జోడి?
X

మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి… 60 ఏళ్ల వయస్సులోను అదే గ్రేస్, అంతకు మించిన యాక్టింగ్‌తో ఫ్యాన్స్‌ను మెప్పించాడు. డ్యాన్స్ స్టెప్పులతో ఫ్యాన్స్‌తో విజిల్స్ కొట్టించాడు. ఖైదీ నం.150తో బ్లాక్ బస్టర్ అందుకున్న చిరు ఆ తర్వాత సైరా నర్సింహారెడ్డి మూవీతో కొంచెం నిరాశ చెందారనే చెప్పాలి. దీంతో తరువాత సినిమా గురించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు చిరంజీవి.

అందుకే కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న 152వ సినిమా స్క్రిప్ట్‌లో కూడా కొంచెం మార్పులు చేసినట్లు తెలుస్తోంది. దేవాలయ భూముల ఆక్రమణ నేపథ్యంలో సాగే కథకు ‘ఆచార్య’ గా టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో చిరు తనయుడు రాంచరణ్ తేజ్ కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 40 నిమిషాల నిడివి ఉన్న చరణ్ పాత్ర సినిమాకు కీలకంగా ఉంటుందట. చెర్రీకి జోడిగా సమంతను తీసుకోవాలని భావిస్తుందట చిత్రయూనిట్. రంగస్థలం సినిమాలో చెర్రీ, సామ్‌ల జోడి సూపర్ హిట్ కాగా… అదే కాంబినేషన్ రిపీట్ చేస్తే బాగుంటుందని ఆశిస్తున్నారట. మరి ఆచితూచి సినిమాలు చేస్తున్న సామ్… ఇందుకు ఓకే చెప్తుందో లేదో చూడాలి మరి.

Advertisement

Next Story

Most Viewed