- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమంత-నాగచైతన్య డైవర్స్.. హింట్ ఇచ్చిన నాగ్?
దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ కపుల్ నాగ చైతన్య-సమంత మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయని, వారిద్దరూ విడిపోయేందుకు సిద్ధమయ్యారనే న్యూస్ కొంతకాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సామ్ తన పేరు నుంచి అక్కినేని సర్ నేమ్ తొలగించినప్పటి నుంచి ఈ రూమర్స్ వినిపిస్తుండగా.. క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కానీ సామ్, చై ఇద్దరూ కూడా దీనిపై స్పందించకపోవడం అభిమానులను టెన్షన్‌కు గురిచేస్తోంది. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్-5 హోస్టింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన నాగార్జున.. ఈ ఇష్యూపై ప్రెస్, మీడియాకు సమాధానం చెబుతారని అనుకున్నప్పటికీ ఆయన మీడియాను కలవకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అతని టీమ్ కరోనా వైరస్ ప్రభావాన్ని అందుకు కారణంగా చూపినా ఫ్యాన్స్ నమ్మడం లేదు. దీనిపై స్పందించాల్సి వస్తుందని, కావాలనే దూరంగా ఉంటున్నారని భావిస్తున్నారు.
అయితే, సామ్-చై మధ్య రిలేషన్ షిప్ సజావుగా ఉంటే ప్రెస్, మీడియాను అవాయిడ్ చేయాల్సిన అవసరం నాగార్జునకు లేదని ఫ్యాన్స్ లెక్కలేస్తున్నారు. ఇవన్నీ పుకార్లేనని కొట్టిపారేసే అవకాశమున్నా.. స్పందించకుండా తప్పించుకోవడం చూస్తుంటే కొడుకు- కోడలు మధ్య సమస్యలున్నాయని ఒప్పుకున్నట్టేనని అన్వయించుకుంటున్నారు. ఇక రీసెంట్‌గా మామ నాగ్ బర్త్‌డే వేడుకలకు సామ్ హాజరుకాక పోవడం కూడా వారు విడిపోతున్నారనేందుకు ఒకరకమైన హింట్ అని గుర్తుచేస్తున్నారు. అయితే, అక్టోబర్‌లో వారి నాలుగో వివాహ వార్షికోత్సవం నాటికి ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.