సమంతను మెస్మరైజ్ చేసిన హాలీవుడ్ ఫిల్మ్..

by Shyam |
సమంతను మెస్మరైజ్ చేసిన హాలీవుడ్ ఫిల్మ్..
X

దిశ, సినిమా: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని హాలీవుడ్ ఫిల్మ్ ‘మాల్కొమ్ & మేరి’ చిత్రం గురించి స్పెషల్ పోస్ట్ పెట్టింది. మోస్ట్ బ్రీత్ టేకింగ్ ఫిల్మ్ అని చెప్పిన హీరోయిన్.. మూవీ మెస్మరైజ్ చేసిందని చెప్పింది. బ్లాక్ అండ్ వైట్ రొమాంటిక్ డ్రామాగా వచ్చిన సినిమా ఫిబ్రవరి 5న నెట్‌ఫ్లిక్స్‌, జిఫ్పీలో రిలీజైంది. సామ్ లెవిన్సన్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలో జాన్ డేవిడ్ వాషింగ్టన్, జెండాయా ప్రధానపాత్రల్లో నటించడంతో పాటు నిర్మాతలుగా వ్యవహరించారు. డైరెక్టర్‌, అతని గర్ల్ ఫ్రెండ్ చుట్టూ సినిమా కథ తిరుగుతుండగా.. దర్శకుడి లేటెస్ట్ మూవీ ప్రీమియర్ షోలో వారి రిలేషన్‌షిప్ గురించి గర్ల్ ఫ్రెండ్ ప్రశ్నించడంతో ఏం జరుగుతుందనేది కథ. కాగా ‘మాల్కొమ్ & మేరి’ చిత్రం స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో అత్యధిక మంది వీక్షించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.

Advertisement

Next Story