- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేరు నుంచి ‘అక్కినేని’ తొలగించిన సమంత.. కారణం?
దిశ, సినిమా : ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ సక్సెస్‌తో జోష్‌లో ఉన్న సమంత అక్కినేని.. ప్రస్తుతం గుణ శేఖర్ తెరకెక్కిస్తున్న మైథలాజిక్ ఫిల్మ్ ‘శాకుంతలం’లో నటిస్తోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సామ్.. ప్రొఫెషనల్, పర్సనల్ విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది. తను సోషల్ మీడియా యాక్టివిటీకి గ్యాప్ ఇచ్చినా లేదా ప్రొఫైల్‌కు మార్పులు చేసినా నెటిజన్లకు ఇట్టే తెలిసిపోతుంది. ఈ క్రమంలోనే సమంత తన పేరును ‘ఎస్’గా మార్చుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు ‘ఎస్’ అనే కనిపిస్తుండగా.. ఫేస్‌బుక్‌లో మాత్రం ‘సమంత అక్కినేని’ అనే ఉంది.
కాగా 2017లో నాగచైతన్యను పెళ్లి చేసుకున్నాక, తన పేరులో అక్కినేని యాడ్ చేసుకున్న హీరోయిన్.. ప్రస్తుతం పేరు మొత్తాన్ని తీసేసి ‘ఎస్’ మాత్రమే ఉంచుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మ్యారేజ్ లైఫ్ లేదా ఫ్యామిలీ లైఫ్‌లో ఏవైనా సమస్యలు తలెత్తాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే సమంత ఈ విషయంపై ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. ఇక సినిమాల పరంగా ‘శాకుంతలం’తో పాటు తమిళ్‌లో విఘ్నేష్ శివన్ డైరెక్షన్‌లో వస్తున్న ‘కాతు వాకుల రెండు కాదల్’ సినిమాలో కనిపించనుంది.