- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీఎం యోగి ఆదిత్యనాధ్ సారీ చెప్పాలి
దిశ, వెబ్ డెస్క్: యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ పై సమాజ్‌వాదీ పార్టీ ఫైర్ అయ్యింది. ‘మసీదు శంకుస్థాపనకు నేను వెళ్లను.. నన్ను ఎవరూ పిలువరు కూడా’ అని ఆయన చేసిన వ్యాఖ్యలపై మండిపడింది. సీఎం యోగి ఈ వ్యాఖ్యలకు చేసినందుకు వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది.
యూపీ సీఎం ప్రమాణ స్వీకారం సందర్భంగా చేసిన ప్రమాణాన్ని యోగి ఉల్లంఘించారని సమాజ్‌వాదీ పార్టీ నేత పవన్ పాండే ఆరోపించారు. ‘ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కేవలం హిందువులకు మాత్రమే కాదు. రాష్ట్రంలోని హిందువులకు, ముస్లింలకు కూడా ఆయన ముఖ్యమంత్రి అని గుర్తుంచుకోవాలని విమర్శించారు. అలాంటి వ్యాఖ్యలు సీఎం హోదా వ్యక్తికి తగినవి కావు. ఈ వ్యాఖ్యలకు గానూ ఆయన క్షమాపణలు చెప్పాలి’ అని ఎస్పీ నేత డిమాండ్ చేశారు.
యోగి వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి..
అయోధ్యలో త్వరలో జరిగే మసీదు శంకుస్థాపనకు వెళ్తారా? అని ప్రశ్నించగా.. ‘ముఖ్యమంత్రిగా అయితే.. నాకు ఏ మతంతో, కులంతో సంబంధం లేదు. ఓ యోగి ఆదిత్యనాధ్‌గా అడిగితే మాత్రం.. కచ్చితంగా నేను హాజరు కాను. ఎందుకంటే నేను హిందువును. ఆ పద్ధతి, సంప్రదాయం ప్రకారమే నడుచుకోవాలి. నేను పిటిషనర్‌ను కాను, ప్రతివాదిని కాను. అందుకే నన్ను ఆహ్వానించరు.. నేను వెళ్లను. అయినా.. నన్ను ఆహ్వానించరు’ అని యోగి వ్యాఖ్యానించారు.