‘సామ్ జామ్’ రొటీన్ ఫ్లేవర్

by Shyam |
‘సామ్ జామ్’ రొటీన్ ఫ్లేవర్
X

దిశ, వెబ్‌డెస్క్ : సమంత ఓ సినిమా ఒప్పుకుందంటే కథతో పాటు క్యారెక్టర్ పరంగా కూడా ప్రేక్షకులు భారీగానే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. తెలుగు సినీ పరిశ్రమలో అలాంటి గుర్తింపు తెచ్చుకున్న సామ్.. ఓటీటీ‌లో టాక్ షో చేస్తుందంటే అంచనాలు అంతకుమించి ఉండే ఛాన్స్ ఉంది. అందుకు తగ్గట్లుగానే ‘సామ్ జామ్’ ట్రైలర్ కట్ చేశారు. సామ్ కూడా తన సోషల్ మీడియా వేదికగా ‘సామ్ జామ్’ టాక్ షో అడ్వర్టైజ్ బాగానే చేసింది. దీనికి తోడు ప్రముఖ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సైతం సామ్ జామ్ ప్రోగ్రామ్ అదరగొడుతుందని, సమంత ఇరగదీస్తుందని చెప్పొకొచ్చాడు. కానీ తీరా ప్రొగ్రామ్ చూసిన ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. సగటు తెలుగు షోల మాదిరే ఉందని, ఇందులో ఏ మాత్రం కొత్తదనం లేదని కామెంట్లు చేస్తున్నారు.

తెలుగు బుల్లితెరపై బోలెడు టాక్ షోలు, రియాలిటీ షోలు వస్తున్నాయి. వాటికితోడు పండుగల సందర్భంగా మరిన్ని ప్రత్యేక ప్రోగ్రామ్స్‌తో చానల్ నిర్వాహకులు ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఎంగేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు అటు ఓటీటీల్లోనూ వెబ్‌సిరీస్‌లు, కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో, ప్రేక్షకులు ఓ షోకు కనెక్ట్ కావాలంటే అందులో కొత్తదనం తప్పక ఉండాల్సిందే. కేవలం ఓ సెలబ్రిటీ షోను హోస్ట్ చేసినంత మాత్రాన అది హిట్ అయిపోదు. ఎంత పెద్ద హీరో ఉన్నా, భారీ బడ్జెట్‌తో సినిమా రూపొందించినా కంటెంట్ లేకపోతే అంతే సంగతులు. అందుకే ‘కంటెంట్ ఈజ్ కింగ్’. ప్రేక్షకులు కూడా ‘సామ్ జామ్’ నుంచి అదే ఆశించారు. కానీ ఆ రేంజ్‌లో లేకపోగా.. తెలుగు టాక్, రియాలిటీ షోల మిశ్రమంగా దాన్ని తీసుకురావడంతో నెటిజన్లు తీవ్రంగా కామెంట్లు చేస్తున్నారు. మొదటి షో‌కు రౌడీ స్టార్ విజయ దేవరకొండ వచ్చినా లాభం లేకపోయింది. ఇక ముందు కూడా ఈ షో ఇలానే రన్ చేస్తే, సామ్‌‌కు కష్టాలు తప్పవని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed