బన్నీ డ్యాన్స్‌కు విజిల్స్ వేసిన బాలీవుడ్ హీరో.. ట్వీట్ వైరల్

by Shyam |
Allu Arjun, Salman Khan
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్.. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. బన్నీ ‘డీజే(దువ్వాడ జగన్నాధమ్)’ సినిమాలోని ‘సీటీమార్‌’ సాంగ్‌ను తన అప్‌కమింగ్ ఫిల్మ్ ‘రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’లోనూ యూజ్ చేశారు. ఈ వీడియో సాంగ్‌ లేటెస్ట్‌గా రిలీజ్ కాగా, అల్లు అర్జున్‌కు థాంక్స్ చెప్తూ ట్వీట్ చేశాడు సల్మాన్. సీటీమార్ సాంగ్‌లో బన్నీ స్టెప్స్‌ అద్భుతంగా ఉన్నాయని.. తను డ్యాన్స్ చేసిన విధానం, స్టైల్ ఫెంటాస్టిక్‌గా ఉందని కాంప్లిమెంట్స్ ఇచ్చాడు.

ఇక ఈ ట్వీట్‌పై స్పందించిన బన్నీ సల్మాన్‌కు థాంక్స్ చెప్పాడు. తన నుంచి కాంప్లిమెంట్స్ అందుకోవడం ఆనందంగా ఉందన్నాడు. మీకోసం ‘సీటీమార్’ చేస్తున్న అభిమానులతో బిగ్ స్క్రీన్స్‌పై ‘రాధే’ మ్యాజిక్ కోసం వెయిట్ చేస్తున్నానని తెలుపుతూ.. మీ ప్రేమకు ధన్యవాదాలు అని చెప్పాడు బన్నీ.

https://twitter.com/alluarjun/status/1386568952361353217?s=20

Advertisement

Next Story