- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బేవకూఫ్ పనులు మానాలని హీరోయిన్‌కు సల్మాన్ వార్నింగ్
దిశ, సినిమా : జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సహా ఎంతోమంది బీటౌన్ యాక్టర్స్ కెరీర్‌ను చక్కదిద్దడంలో సల్మాన్ ఖాన్ హెల్ప్ చేశాడు. కాగా జాక్వెలిన్ ‘కిక్’ సినిమాలో కలిసి నటించగా.. అప్పటి నుంచి వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్‌గా కొనసాగుతున్నారు. తాజాగా ‘అంతిమ్’ మూవీ ప్రమోషన్స్ కోసం ‘కపిల్ శర్మ షో’కు హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ రివీల్ చేసిన సల్మాన్.. ఫిట్‌నెస్ కోసం పన్వేల్‌లోని తన ఫార్మ్‌హౌస్‌లో వ్యవసాయం చేయమని జాక్వెలిన్‌కు సూచించినట్లు తెలిపాడు. గతేడాది లాక్‌డౌన్ టైమ్‌లో సల్మాన్ తన ఫ్రెండ్స్‌తో కలిసి అక్కడే స్పెండ్ చేయగా.. వారిలో జాక్వెలిన్ కూడా ఉంది. ఆ టైమ్‌లో ప్రతిరోజూ ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తేదని, అయితే అలాంటి ఫూలిష్ పనులకు బదులు వ్యవసాయం చేస్తే బెటర్ అని తనకు చెప్పినట్టు గుర్తుచేశాడు. రోజంతా పనిచేస్తే ఆరోగ్యంతో పాటు పంటలు కూడా పండిచినట్లు అవుతుందనే అలా చెప్పానన్నాడు.