పర్మిషన్ లేకుండా పటాకుల విక్రయాలు..

by Shyam |
పర్మిషన్ లేకుండా పటాకుల విక్రయాలు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: దీపావళి పండుగ సందర్భంగా జిల్లాలో ప్రతి సంవత్సరం పటాకుల విక్రయాలు భారీగానే జరుగుతాయి. అయితే దుకాణాల ఏర్పాటులో నిర్వాహకు లు నిబంధనలను ఖాతరు చేయడం లేదు. అధికారులు ‘మామూలు’గా తీసుకోవడం వల్లే ఎలాంటి పర్మిషన్ లేకుం డానే నిజామాబాద్ నడిబొడ్డున యథేచ్ఛగా అమ్మకాలు జరుగుతున్నాయి. యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలూ ఉన్నాయి. అత్యంత జనసమర్థం గల కిసాన్గంజ్లో హోల్ సేల్గా విక్రయాలు జరుగుతుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికుల్లో భయాందోళన నెలకొంది. ఇదంతా పోలీస్, రెవెన్యూ, అగ్ని మాపక శాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడంలేదు. ప్రమాదం జరిగితే పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగే అవకాశాలున్నా అధికారుల్లో మార్పు రావడంలేదని, కనీసం దుకాణాలను శివారు ప్రాంతాలకు తరలిద్దామన్న ఆలోచన రాకపోవడం శోచనీయమని పలువురు వాపోతున్నారు.

ప్రమాదం జరిగినప్పుడే హడావిడి..

చుట్టూ వందలాది ఇళ్ల మధ్యలో, నిత్యం వేలాది మంది ప్ర జలు సంచరిస్తున్న చోట దుకాణాలు ఏర్పాటు చేస్తుండడం ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట ఏదైనా ప్రమాదం జరిగినప్పుడే అగ్నిమాపక శాఖ అధికారులు చేసే హడావిడి అంతా ఇంతా కాదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెండేళ్ల క్రితమే కొందరు వ్యాపారులు నిజామాబాద్ బైపాస్ వద్ద గోదాములను ఏర్పాటు చేసుకున్నా, నగర నడిబొడ్డున ఉన్న కిసాన్ గంజ్ లోనే దందా నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇంత జరుగుతున్నా అగ్నిమాపక, పోలీసు, రెవెన్యూ శాఖ తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణులున్నాయి.

కిసాన్గంజ్ నుంచే..

దీపావళి పండుగ సందర్భంగా జిల్లాలో పటాకుల అమ్మకాలు జోరుగా సాగుతాయి. రూ.కోట్లకు పైగా అమ్మకాలు జరిపే వ్యాపారులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా రనే ఆరోపణలున్నాయి. ప్రతి ఏడాది నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ, ఎల్లారెడ్డి తదితర ప్రాంతాల్లో పటాకుల విక్రయాలు జరుగుతుంటాయి. వ్యాపారులంతా నిజామాబాద్ కిసాన్గంజ్నుంచే హోల్సేల్గా కొనుక్కుని ఆయా ప్రాంతాలకు తీసుకెళ్తుంటారు. రిటేల్ దుకాణాల అనుమతికి సవాలక్ష నిబంధనలను ఖచ్చితంగా అమలు చేసే యంత్రాంగం నగరం నడిబొడ్డున నిర్వహిస్తున్న హోల్ సేల్ వ్యాపారాలపై చర్యలు తీ సుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. జనావాసాల మధ్య పటాకులు అమ్ముతుంటే చిన్న నిప్పురవ్వ రేగినా జరిగే ప్రాణ, ఆస్తినష్టం భారీగానే ఉంటుంది. అనుమతులు లేకుండా దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులపై అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడానికి సాహసించడం లేదనే ఆరోపణున్నాయి.

Advertisement

Next Story

Most Viewed