కరోనా దెబ్బకు క్రికెటర్ల వేతనాల్లో కోత ?

by vinod kumar |
కరోనా దెబ్బకు క్రికెటర్ల వేతనాల్లో కోత ?
X

కరోనా మహమ్మారి కారణంగా మన దేశమే కాకుండా ప్రపంచంలో సగం దేశాల వరకు లాక్‌డౌన్‌లోనే ఉన్నాయి. దేశాల మధ్య రాకపోకలు ఆగిపోవడంతో పాటు ప్రజలు కూడా ఇండ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో పలు క్రీడా టోర్నీలతో పాటు ఇండియాలో క్రికెట్‌కు కూడా బ్రేక్ పడింది. అంతేనా.. బీసీసీఐకి కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ కూడా ఏప్రిల్ 15కు వాయిదా పడింది. ఆ తర్వాతైనా జరుగుతుందో లేదో అనుమానంగానే ఉంది. కాగా, జాతీయ కాంట్రాక్టులే కాక రంజీలు, స్థానిక మ్యాచులకు సంబంధించి బీసీసీఐతో పాటు రాష్ట్రాల అసోసియేషన్లు పలువురు క్రికెటర్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. కాగా, వీరికి వేతనాల్లో కోత పడే అవకాశం ఉన్నట్లు ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ మల్హోత్రా స్పష్టం చేశారు.

ప్రస్తుతం బోర్డుకు ఆదాయం రావడం లేదని.. టోర్నీలు నిర్వహిస్తే తప్ప బీసీసీఐకి రెవెన్యూ జనరేట్ కాదని.. ఇప్పుడు అన్ని రకాల క్రికెట్ టోర్నీలు ఆగిపోవడంతో బోర్డు ఆర్థిక కష్టాల్లో ఉన్నట్లు ఆయన తెలిపారు. దీంతో ఈ ఏడాది వార్షిక వేతనాల్లో కోత తప్పదని.. క్రికెటర్లు కూడా దీనిని అర్థం చేసుకుంటారని ఆయన చెప్పారు. ఐపీఎల్ జరిగితే కాస్తయినా నష్టాన్ని పూడ్చుకోవచ్చని.. మొత్తానికే రద్దయితే మాత్రం రూ. 10 వేల కోట్ల వరకు బోర్డు, ఫ్రాంచైజీలు నష్టపోతాయని ఆయన వెల్లడించారు.

Tags: Corona, Cricketers Salaries, BCCI, IPL, Finacial Crisis

Advertisement

Next Story

Most Viewed