అనాథ పిల్లలతో సాక్షి వాలెంటైన్స్ డే

by Jakkula Samataha |
అనాథ పిల్లలతో సాక్షి వాలెంటైన్స్ డే
X

దిశ, సినిమా :బిగ్ బాస్ తమిళ్ ఫేమ్ సాక్షి అగర్వాల్ ‘వాలెంటైన్స్ డే’ను స్పెషల్‌గా జరుపుకుంది. ప్రేమను మోస్ట్ ‘స్పెషల్ వే’లో స్ప్రెడ్ చేసింది. ప్రేమికుల రోజు అంటే కేవలం రొమాన్స్, గిఫ్ట్స్ షేర్ చేసుకోవడమే కాదు, ఈ విధంగాను ప్రేమను పంచవచ్చని సూచించింది. ఈ ప్రత్యేక రోజును అనాథ పిల్లలతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ‘వాలెంటైన్స్ డే.. కేవలం ఒక అబ్బాయి లేదా అమ్మాయి మధ్యనున్న ప్రేమకు మించినది, మన చుట్టూ ఉన్న అందరికీ ప్రేమను పంచే సీజన్. ప్రతీ వ్యక్తి ఈ డేను విభిన్న మార్గాల్లో జరుపుకోవడానికి ఎంచుకోవచ్చు. నేను ఈ ‘వాలెంటైన్స్ డే’ను అనాథాశ్రమానికి చెందిన సూపర్ టాలెంటెడ్‌ పిల్లలతో గడిపాను. వారి ఆనందం కంటే ఎక్కువ ఏదీ కాదు. వారి నుంచి పొందే ప్రేమ ప్రపంచంలో అన్నింటికన్నా గొప్పది. ఈ ఆనందకరమైన క్షణాలను నా ఇన్‌స్టా ఫ్యామిలీతో పంచుకోవడం సంతోషంగా ఉంది’ అంటూ తన ప్రౌడ్ మూమెంట్స్‌ను పంచుకుంది సాక్షి అగర్వాల్. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు సాక్షిని ప్రశంసిస్తున్నారు. అందరు సెలబ్రిటీల్లా లవ్ పోస్ట్‌లు పెట్టకుండా.. ఇలాంటి మంచి పనులు చేయడాన్ని కొనియాడుతున్నారు.

అనాథ పిల్లల మధ్య యంగ్ హీరో బర్త్‌డే

Advertisement

Next Story