బాబులో ఎలాంటి మార్పు రాలేదు – సజ్జల 

by srinivas |
బాబులో ఎలాంటి మార్పు రాలేదు – సజ్జల 
X

దిశ, వెబ్ డెస్క్: అధికారం కోల్పోయి 14 నెలలు అయినా చంద్రబాబులో ఎలాంటి మార్పు రాలేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ అధినేతను విమర్శించారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు తన స్వార్థం కోసమే ఆలోచించారు తప్ప ప్రజల గురించి పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.

స్వార్థానికి కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబు అంటూ విమర్శించారు. అలాంటి వ్యక్తి నోటివెంట విధ్వంసం అని వినడం విడ్డురంగా ఉందని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ 14 నెలల పాలనలో 53 వేల కోట్ల రూపాయల సంక్షేమం నేరుగా ప్రజలకు అందించారన్నారు. ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లడం విధ్వంసమా? అవినీతి రహిత పాలన అందించడం విధ్వంసమా? అని సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు.

Advertisement

Next Story