తేజ్ పేరుతో వాట్సాప్ చాట్.. ఆ తర్వాత?

by Jakkula Samataha |
తేజ్ పేరుతో వాట్సాప్ చాట్.. ఆ తర్వాత?
X

దిశ, సినిమా : సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ అభిమానులను అప్రమత్తంగా ఉండమని సూచించాడు. తన పేరు చెప్పి వాట్సాప్ చాట్‌లో ఫ్రెండ్‌షిప్ చేస్తున్న ఓ వ్యక్తి, ఆ తర్వాత చీటింగ్ చేస్తున్నాడని తెలిపాడు. డబ్బులు వసూలు చేస్తూ మోసం చేస్తున్నాడని, అలాంటి వారిని నమ్మకూడదని హెచ్చరించాడు. తన పేరుతో ఫైనాన్షియల్ హెల్ప్ అడుగుతున్నాడని నోటీసులోకి వచ్చిందన్న తేజ్.. దీనిపై లీగల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ అయ్యాయని తెలిపాడు. ఇందుకు సంబంధించి వాట్సాప్‌ స్క్రీన్ షాట్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన తేజ్.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని ఇలాంటి కన్వర్జేషన్‌లకు దూరంగా ఉండాలని సూచించాడు.

https://twitter.com/IamSaiDharamTej/status/1388114357783982089?s=20

Advertisement

Next Story