సాగర్​ ఉపఎన్నిక పరిశీలకుడి మార్పు..

by vinod kumar |   ( Updated:2021-04-03 08:37:11.0  )
సాగర్​ ఉపఎన్నిక పరిశీలకుడి మార్పు..
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో జరగనున్న నాగార్జున సాగర్ ఉపఎన్నికల పరిశీలకుడికి కరోనా పాజిటివ్​ రావడంతో… ఆయన్ను రీప్లేస్ చేసినట్లు ఈసీ ప్రకటించింది. ఉపఎన్నిక పరిశీలకుడిగా ఉత్తరప్రదేశ్‌ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి రాహుల్‌సింగ్‌ 29వ తేదీన కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది.

ప్రభుత్వ అతిథి గృహంలోనే చికిత్స తీసుకున్న ఆయనకు ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌కు తరలించారు. ఆయన స్థానంలో కేంద్ర ఎన్నికల సంఘం సజ్జన్‌సింగ్‌ ఆర్‌ చవాన్‌ను పరిశీలకుడిగా నియమించింది.

Advertisement

Next Story