- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రమాణం చేసేందుకు సిద్ధమా..? మంత్రి గంగులకు సర్దార్ సవాల్
దిశ, కరీంనగర్ సిటీ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం ఎక్కడా లేని విధంగా అక్రమ కలయికకు పాల్పడిన ఘనత మీదేనని, కాంగ్రెస్, బీజేపీ నాయకులతో మాట్లాడి మంత్రి గంగుల క్యాంపులకు తరలించారని మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆరోపించారు. బుధవారం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మంత్రి గంగులపై విరుచుకుపడ్డాడు. తనకు సింగిల్ డిజిట్ ఓట్లు మించకుండా ఆరుగురు మంత్రులు, పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు అడ్డుపడి రూ.80 కోట్ల నుంచి రూ. 100 కోట్లు ఖర్చు పెట్టినా మూడంకెల సంఖ్యలో ఓట్లు తెచ్చుకున్నానని తెలిపారు.
బీసీ మంత్రి అయి ఉండి మీ పార్టీ ప్రకటించిన బీసీ అభ్యర్థిని ఓడించే కుట్రకు తెరలేపిన చరిత్ర మంత్రి గంగులదేనని అన్నారు. ఎల్.రమణ గెలిస్తే మంత్రి పదవి పోతుందనే భయంతో అంతర్గత మద్దతు తెలపలేదన్నారు. ఆ పార్టీ అభ్యర్థుల ఇద్ద రిమధ్య వచ్చిన ఓట్ల తేడా దీనిని తేటతెల్లం చేస్తోందన్నారు. క్రమశిక్షణ గల పార్టీ తమదంటూ పదేపదే నొక్కి వక్కానిస్తున్న మంత్రి గంగుల.. తెరాస లెక్క ప్రకారం రమణకు రావాల్సిన ఓట్లు 499 అని, మరెందుకు తగ్గాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఓటర్లు కూడా తనకు మద్దతు తెలిపారని, తనను స్వతంత్ర ఎమ్మెల్సీగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బరిలో నిలిపారని మంత్రి గంగుల చెప్పడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు.
ఉద్యమకారునిగా తనకు మద్దతు మాత్రమే ఇచ్చారని స్పష్టం చేశారు. దీనిపై ఇంకేమి అనుమానం ఉన్నా.. వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేసేందుకు సిద్ధమేనని, మరి మంత్రి గంగుల సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఉద్యమకారులను అవమానిస్తే రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.