చదివేది మూడో తరగతి.. సంపాదన మాత్రం రూ.217 కోట్లు

by Anukaran |   ( Updated:2020-12-25 01:59:09.0  )
చదివేది మూడో తరగతి.. సంపాదన మాత్రం రూ.217 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్ : పనిచేస్తారు. ప్రతిఫలం కోసం ఎదురు చూస్తుంటారు. రాలేదని ఢీలా పడిపోతుంటారు. కానీ అలా కాకుండా నాలా పని చేసుకుంటూ వెళితే ఆటోమేటిగ్గా విజయం మీ సొంతం అవుతుందని అంటున్నాడు తొమ్మిదేళ్ల బాలుడు. వయస్సు తొమ్మిదేళ్లే అయినా టాప్ కంపెనీ సీఈఓలు ఎంతైతే సంపాదిస్తే ఈ బుడతడు కూడా అలాగే సంపాదిస్తున్నాడు. ఎలా అంటారా..? అమెరికా టెక్సాస్‌కు చెందిన ర్యాన్ కాజీ ‘ర్యాన్స్ వరల్డ్’ యూట్యూబ్ ఛానల్ ద్వారా 29.5 మిలియన్లు (సుమారు రూ.217కోట్లు) సంపాదించడంతో ఫోర్బ్స్ మ్యాగజైన్‌లో చోటు దక్కించుకున్నాడు. అత్యధిక ఆదాయంలో పోటీపడి వరుసగా మూడోసారి ఫోర్బ్స్ తన స్థానాన్ని నిలుపుకున్నాడు. ర్యాన్‌కాజీ, అసలు పేరు ర్యాన్ గువాన్. అతను కేవలం నాలుగేళ్ల వయసులోనే 2015 లో ర్యాన్ టాయ్స్ రివ్యూ పేరుతో బొమ్మల్ని అన్ బాక్సింగ్ చేసేవాడు. ఇలా రోజూ బొమ్మల్ని అన్ బాక్సింగ్ చేయడంతో యూట్యూబ్ లో బాగా వైరల్ అయ్యేవి. ఆదాయాన్ని భారీ ఎత్తున గడించేవాడు. ప్రస్తుతం 3వ తరగతి చదువుతున్న ర్యాన్ ఇప్పుడు ఏకంగా తొమ్మిదిఛానళ్లను రన్ చేస్తున్నాడు. అయితే చిన్నపిల్లల వీడియోలపై యూట్యూబ్ ఆంక్షలు విధించడంతో ఆదాయం తగ్గిందని ర్యాన్ కుటుంబసబ్యులు చెబుతున్నారు.

Advertisement

Next Story