- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రష్యన్ యువతికి.. తిరుపతిలో తిప్పలు
దిశ, వెబ్ డెస్క్: ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్లిన కార్మికులను కరోనా మహమ్మారి అతలాకుతలం చేసింది. అంతేగాకుండా లాక్‌డౌన్‌కు ముందు ఇతర ప్రాంతాలకు టూర్‌లకు వెళ్లిన వారి పరిస్థితి కూడా దయనీయంగా మారింది. ఏపీలోని తిరుమల ఆలయానికి రష్యా నుంచి తల్లితోపాటు వచ్చిన ఓ యువతి అనేక ఇబ్బందులు పడింది. కొంతకాలం కింద రష్యా దేశానికి చెందిన ఎస్తర్ అనే యువతి తన తల్లి ఒలీవియాతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చింది. లాక్ డౌన్ కారణంగా తిరుపతిలో చిక్కుకుంది. తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోయాయి. ఈ క్రమంలో ఉత్తరభారతదేశంలోని బృందావనంలో ఉన్న తల్లిని కలవలేక, రష్యా ఎలా వెళ్లాలో తెలియక తల్లడిల్లిపోయింది. విషయం తెలుసుకున్న దినపత్రిక ఆమెపై కథనం ప్రచురించుంది. దీంతో హైదరాబాదుకు చెందిన మారం ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ అధిపతి సతీశ్ రూ.25 వేలు, తిరుపతిలో పనిచేస్తున్న ఏపీ ట్రాన్స్ కో అధికారి రూ.10 వేలు అందజేశారు. చివరకు విషయం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి తెలియడంతో, రష్యా యువతికి ఫోన్ చేసి విషయం తెలసుకున్నారు. తన పీఏ ద్వారా రూ.10 వేలు పంపడమే కాకుండా, బృందావనంలో ఉన్న ఆమె తల్లి ఒలీవియాను తిరుపతి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఇక ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె దీపా వెంకట్ సూచనల మేరకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాశ్ రెడ్డి రష్యన్ యువతి ఎస్తర్‌ను పరామర్శించారు.