- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఆర్ఎస్ ఎమ్మెల్యేతో ప్రాణహాని.. రక్షించండి
దిశ, హైదరాబాద్ : భూపాలపల్లి శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డితో తమ ప్రాణాలకు హాని ఉందని, ఆయన నుండి రక్షణ కల్పించాలని రేగొండ మండలం రూపిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ బండారి కవిత తన భర్త దేవేందర్ తో కలిసి సోమవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి విషయమై ఎమ్మెల్యే తో పలుమార్లు మాట్లాడే ప్రయత్నం చేయగా ఆయన పట్టించుకోకుండా తమను టార్గెట్ చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యేకు బీసీలంటే చులకన భావం ఉందని, తన భర్త తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడుగా పని చేయడంతో పాటు బీసీల హక్కుల కోసంపోరాటం చేయడం ఆయనకు గిట్టడం లేదన్నారు. ఈనెల 2వ తేదీన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల అభివృద్ది గురించి పలువురు సర్పంచ్ లు, ఇతర నాయకులు కలవడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా తన భర్త దేవేందర్ గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు వెల్లడించారు. దీనికి ప్రతిగా ఎమ్మెల్యే నువ్వు బీసీ సంఘంలో పని చేసినంత కాలం మీ గ్రామానికి నిధులు ఇవ్వనని హెచ్చిరించినట్లు చెప్పారు. అనంతరం అతని అనుచరులతో బెదిరిస్తున్నారని, ఎమ్మెల్యేతో తమకు ప్రాణహాని ఉందని కవిత వాపోయారు. ఈ విషయంలో విచారణ నిర్వహించి తమకు రక్షణ కల్పించాలని ఆమె హక్కుల కమిషన్ ను కోరారు.