14 నుంచి 24 గంటలు ఆర్‌టీజీఎస్ సేవలు!

by Harish |   ( Updated:2020-12-09 07:01:53.0  )
14 నుంచి 24 గంటలు ఆర్‌టీజీఎస్ సేవలు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్‌టీజీఎస్ సేవలు డిసెంబర్ 14 నుంచి ఏడాదిలో అన్ని రోజుల్లో 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) బుధవారం ప్రకటించింది. దీంతో ప్రపంచంలోనే ఆర్‌టీజీఎస్ సేవలను 24 గంటలూ అందుబాటులో తెస్తున్న దేశాల్లో భారత్ ఒకటిగా నిలవనుందని ఆర్‌బీఐ పేర్కొంది. ప్రస్తుత నెలలో రెండు, నాలుగో శనివారం, ఆదివారం మినహా అన్ని పని దినాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల అరకు ట్రాన్స్‌ఫర్ సౌకర్యం అందుబాటులో ఉంది. ‘ఆర్‌టీజీఎస్ సౌకర్యం అన్ని సమయాల్లో లభించడం వల్ల వ్యాపారాల లావాదేవీలకు సులువుగా ఉంటుంది.

చెల్లింపుల వ్యవస్థలో పరిష్కారంగా ఆర్‌టీజీఎస్ సౌకర్యం ఉంటుందని’ ఆర్‌బీఐ తెలిపింది. ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కువ మొత్తం నగదును బదిలీ చేయాలనుకునేవారు ఆర్‌టీజీఎస్ పద్దతిలోనే చేయాల్సి ఉంటుంది. 24 గంటల పాటు ఈ సేవలను అందించేందుకు తగినట్టు పేమెంట్ సిస్టంలో మార్పులు చేశామని ఆర్‌బీఐ తెలిపింది. ఇప్పటివరకు నెఫ్ట్ పద్దతి ద్వారా మాత్రమే 24 గంటలు పేమెంట్ చేసుకునేందుకు వీలుండేది. ఇప్పుడు ఆర్‌టీజీఎస్ సౌకర్యం వచ్చింది. ఈ విధానంలో కనీసం రూ. 2 లక్షల నగదును బదిలీ చేసుకోవాలి. గరిష్ఠానికి పరిమితి లేదు.

Advertisement

Next Story

Most Viewed