ఏప్రిల్ 18న ఆ సేవలకు అంతరాయం : ఆర్‌బీఐ

by Harish |
ఏప్రిల్ 18న ఆ సేవలకు అంతరాయం : ఆర్‌బీఐ
X

దిశ, వెబ్‌డెస్క్: అధిక మొత్తం నగదు లావాదేవీలను నిర్వహించే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) కీలక ప్రకటన జారీ చేసింది. దేశవ్యాప్తంగా రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్(ఆర్‌టీజీఎస్) సేవలను ఏప్రిల్ 18న(ఆదివారం) సేవలను 14 గంటల పాటు నిలిపేయనున్నట్టు తెలిపింది. ఏప్రిల్ 17 సాధారణ కార్యకలాపాలు ముగిసిన తర్వాత 18న అర్ధరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆర్‌టీజీఎస్ సేవలను నిలిచిపోనున్నట్టు వివరించింది. ఆర్‌టీజీఎస్ సేవలను అప్‌గ్రేడ్ చేయడం కోసం కొన్ని గంటల పాటు సేవలను నిలిపేయాల్సి వస్తోందని ఆర్‌బీఐ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆర్‌టీజీఎస్ సేవలు నిలిచిపోయిన సమయంలో వినియోగదారులు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ టాన్స్‌ఫర్(నెఫ్ట్) సేవలను వినియోగించుకోవచ్చని పేర్కొంది. ఈ సేవలకు ఎటువంటి అంతరాయం ఉండదని, ఆర్‌టీజీఎస్ సేవలకు మాత్రమే ప్రత్యామ్నాయం ఉపయోగించుకోవాలని సూచించింది. సాధారణంగా రూ. 2 లక్షలకు మించి నగదు లావాదేవీలకు ఆర్‌టీజీఎస్ సేవలు ఉపయోగపడతాయి.

Advertisement

Next Story

Most Viewed